Trending Now

పోస్టల్ బ్యాలెట్ కు అర్హుల నోటిఫై..

ప్రతిపక్షం, ఢిల్లీ: లోక్ సభ,శాసనసభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అర్హత గల వారిని నోటిఫై చేసింది. అత్యవసర సేవల్లో ఉన్న వారిని ఆబ్సెంటి ఓటర్లుగా పరిగణించి వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. మెట్రో రైల్వేలు, బిఎస్ఎన్ఎల్ విద్యుత్ ఆరోగ్యశాఖలు అగ్నిమాపక, తపాలా శాఖ, విమానయానం, విపత్తు నిర్వహణ సిబ్బంది తదితరులకు కమిషన్ అనుమతి ఇచ్చిన మీడియా వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. 1951 ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించిన అనంతరం నిత్యవసర సేవలు అత్యవసర సేవలో ఉన్న వ్యక్తులను పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతించవచ్చునని నోటిఫై చేశారు.

Spread the love