Jasprit Bumrah NO.1 in ICC Test rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భారత బౌలర్ బుమ్రా అదరగొట్టాడు. బౌలర్ల విభాగంలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడు రవిచంద్రన్ అశ్విన్ (869)ని వెనక్కినెట్టి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఆరు వికెట్లతో బుమ్రా చెలరేగాడు. దీంతో అశ్విన్‌ను అధిగమించి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, కగిసో రబాడ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగై మూడో స్థానానికి చేరగా.. విరాట్ కోహ్లీ ఆరు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. రోహిత్ శర్మ టాప్ 10 నుంచి ఐదు స్థానాలు దిగజారి 15వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జో రూట్, కేన్ విలియమ్సన్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.