Trending Now

తెలంగాణ ఇంఛార్జ్​ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్​గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి ఎల్జీ (లెఫ్టినెంట్ గవర్నర్)గానూ ఆయనకు అదనపు బాధ్యతలను కట్టబెట్టారు.మరోవైపు తెలంగాణ గవర్నర్​తో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా అదనపు బాధ్యతలు అప్పగించటం పట్ల ఝార్ఖండ్​ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎక్స్​ వేదికగా​ స్పందించారు. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Related News

Latest News