Trending Now

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు.. కేటీఆర్ కీలక కామెంట్స్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దళిత బంధు, బీసీ బంధు పెట్టినప్పుడు సమాజంలో ఇత వర్గాల నుంచి కొంత ఇబ్బంది అవుతుందని హెచ్చరించిన.. రాజకీయంగా రిస్క్ తీసుకొని బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురు వారం తెలంగాణ భవన్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సంఘం కోసం సమాజం కోసం పని చేసి శాశ్వతమైన ఖ్యాతిని సాధించుకున్న గొప్ప మహా మనిషి జ్యోతిబాపూలేనని.. 197 సంవత్సరాల క్రితం జన్మించిన పూలే గారు ఎంచుకున్న మార్గం ఆయన బోధనలు ఇప్పటికీ కూడా అందరికీ ఆచరణీయమన్నారు. విద్యతోనే అనే వికాసం వస్తుందని.. బలమైన నమ్మకంతో తన ఇంటి నుంచే మార్పు మొదలుపెట్టి ముందుకు సాగిన గొప్ప వ్యక్తిని ఆయనను కొనియాడారు. మనము ఏ కులం.. ఏ మతంలో పుట్టాలి అన్న విషయం మన చేతిలో లేదు.. కానీ అవకాశాల కల్పన, ఉపాధి కల్పన అందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చే అవకాశం సమాజానికి ప్రభుత్వానికి ఉన్నదని పేర్కొన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర చరిత్రలో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం గత పది సంవత్సరాల మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతామని చెప్పుకొచ్చారు. విద్యతోనే వికాసం.. వికాసం తోనే సమానత్వం అన్న పూలే గారి ఆలోచనలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 1000 కి పైగా గురుకుల పాఠశాలలను పెట్టి విద్యను అందించామన్నారు.

ఒక్కో విద్యార్థి పైన 1,25,000 ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్య అందించామని.. మహాత్మా జ్యోతిబాపూలే చెప్పిన స్ఫూర్తి తోనే ఈ కార్యక్రమం కొనసాగిందన్నారు. ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్ కాలేజీకి అగ్రీడ్ చేశాను.. బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టాం.. మహాత్మ జ్యోతిబాపూలే పేరుతో 20 లక్షల రూపాయల ఓవర్సీస్ ఫెలోషిప్ ను అందించాం.. ఈ విషయంలో దళిత గిరిజన బహుజన అగ్రవర్ణ పేదలు అన్న వివక్ష చూడలేదని స్పష్టంచేశారు. మేము విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఆచరణ ద్వారా మహాత్మ పూలే ఆలోచనలను ముందుకు తీసుకుపోయామని.. అలాగే అసెంబ్లీలో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ మాదేనని.. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లోనూ ఐదు రిజర్వేషన్ సీట్లు పోతే 12 సీట్లలో 50% సీట్లు కేటాయించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. ఎన్నికల ముందు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి.. వారి నుంచి ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహాత్మ పూలే పేరుతో 20 వేల కోట్ల రూపాయల బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు..? మొన్న వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదని మండిపడ్డారు. రానున్న బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు దాన్ని వెంటనే నిలుపుకోవాలని కోరారు. బీసీలకు అంతర్జాతీయ స్థాయి గురుకులాలు పెడతామన్నారు.. మండలానికి ఒకటి వెంటనే ప్రారంభించాలి. రాబోయే మూడు సంవత్సరాలలో ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మహాత్మ జ్యోతిబాపూలే సమున్నత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీల విషయంలో కేవలం మాటలకే పరిమితం కాకుండా మీరు ఇచ్చిన హామీలని ఆచరణలోకి రావాలని కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Related News

Latest News