జొన్నలు కొనుగోలు చేయాలని మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ ధర్నా

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూన్ 30: జిల్లాలో జొన్నల కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ ఏం పద్మ దేవేందర్ రెడ్డి, రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు బటాయించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జొన్నల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుందని వర్షం వస్తే జొన్నలు కొనుగోలు చేయలేని పరిస్థితి కూడా వెంటనే ప్రభుత్వం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వీధి కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు గడ్డమీద కృష్ణా గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొనగా రామయంపేట్ నుండి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు.

Spread the love

Related News

Latest News