Trending Now

IPL 2024: నేడు లక్నోతో చెన్నై ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లక్నో సూపర్ జెయిట్స్ చేతిలో ఎదురైన పరాభవానికి సొంత గడ్డపై బదులు తీర్చుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సమాయత్తమవుతోంది. మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై, లక్నోలు తలపడనున్నాయి. గతవారం లక్నో వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. లక్నో జట్టు సులువుగా విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సొంత గడ్డపై లక్నోను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని చెన్నై భావిస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై 7 మ్యాచ్‌లాడి 4 విజయాలతో పట్టికలో 4వ ప్లేస్‌లో ఉండగా.. మరోవైపు లక్నో కూడా అనే విజయాలతో 5వ స్థానంలో ఉంది. మరి మ్యాచ్‌లో చెన్నై బదులు తీర్చుకుంటుందా.. లేక లక్నోనే మరోసారి పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరం.

బ్యాటింగ్‌లో చెన్నై పటిష్టంగా కనిపిస్తున్నా ఓపెనర్ రచిన్ రవీంద్ర పేవవ ఫామ్ ఆ జట్టున కలవరపరుస్తోంది. ఇక కెప్టెన్ రుతురాజ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా లు మంచి ఫామ్ కనబరుస్తుండగా.. ఆఖరిల్లో ధోని ఫినిషర్‌గా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్, మతీశా పతీరణ కీలకం కానున్నారు. మరోవైపు లక్నో విషయానిక వస్తే ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్‌లపైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఫినిషర్‌గా వస్తున్న నికోలస్ పూరన్ ఆకట్టుకుటున్నప్పటికి మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించాడం లేదు. ఇక బౌలింగ్‌లో అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్‌లు కీలకం కానున్నారు.

Spread the love

Related News

Latest News