ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. షెడ్యూల్ ప్రకారం నేటితో గడువు ముగుస్తుండగా ఈనెల 20 వరకు పొడిగించింది. అలాగే 11 నుంచి 20 వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించింది. కాగా నిన్నటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి.