హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ను ఆ పార్టీ అధినేత కేఏ పాల్ నియమించారు. కాగా, బాబూ మోహన్ కొద్ది రోజుల క్రితమే ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పార్టీ తనని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలిచారు. బీఆర్‌ఎస్ నుంచి చంటి క్రాంతి కిరణ్ రెండో స్థానంలో నిలువగా బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసిందే.