ప్రతిపక్షం, జూన్ 17: హైదరాబాద్ వనస్థలిపురంలో సైబర్ మోసగాళ్లు ఫేస్‌బుక్ ద్వారా ఓ వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని రూ.30.54 లక్షలు కాజేశారు. నాగబండి శ్రీనివాసులు (60) అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమై, తాను ట్రేడింగ్ నిపుణురాలినని నమ్మించింది. నకిలీ సెబీ పత్రాలు చూపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించింది. ఆమె మాటలు నమ్మిన శ్రీనివాసులు దశలవారీగా రూ.30.54 లక్షలు పెట్టుబడి పెట్టగా, కేవలం రూ.1 లక్ష మాత్రమే తిరిగి వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

















