Trending Now

రెండు రోజుల్లో గుడ్ న్యూస్.. సొంత పార్టీపై కమల్ హాసన్ సంచలన ప్రకటన

ప్రతిపక్షం, నేషనల్: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ సారి రాబోయే ఎన్నికల్లో సినీ తారాలు మెరవాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ, అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుంది అని తెగ వార్తలు వస్తు్న్నాయి. మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని కమల్ హాసన్ ప్రకటన చేయడంతో.. ఈ పొత్తు దాదాపు ఖరారు అయినట్లే అనిపిస్తుంది. త్వరలోనే డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అవుతారని తెలుస్తొంది. ఈ సమావేశంలోనే లోక్ సభలో ఎన్నికల్లో పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం అందుతొంది.

Spread the love