Trending Now

ఓటమి భయంతోనే పాలమూరులో కాంగ్రెస్ నీచ రాజకీయాలు..

ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

ప్రతిపక్షం, మహాబూబ్ నగర్: ఓటమి భయంతోనే పాలమూరులో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తున్నదని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహాబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని మఖ్తల్ నియోజకవర్గంలో డీకే అరుణ లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఉమ్మడి జిల్లాలో మా కుటుంబంపై ఈ కల్వకుర్థోళ్ళు కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. ఆనాడు జైపాల్ రెడ్డి మొదలు ఇప్పటి సీఎం రేవంత్ వరకు నన్ను నా కుటుంబాన్ని అనగదొక్కాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఆరోజు జైపాల్ రెడ్డి నాకు టికెట్ రాకుండా చేసారని అంతేకాదు మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డికి అప్పుడు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జైపాలిరెడ్డి ఓర్వలేక పోయడాని, అ కోపంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్న అలంపూర్, గద్వాలను మహబూబ్ నగర్ లోంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో కలిపారని గుర్తు చేసారు. నేను ఒక ఆడపిల్లను అయినా ఉమ్మడి జిల్లా మొత్తం పని చేశానని ఉమ్మడి జిల్లా మంత్రిగా 14 నియోజకవర్గాలలో డీకే అరుణమ్మ పనిచేసింది. ప్రజల కోసం ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్ట్ ల్ కోసం పోరాటం చేశానని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర నాది అని తెలిపారు. అప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు తీసుకువచ్చింది నేనేనని.. అరుణమ్మను రాజకీయంగా ఎదురుకోలేక రేవంత్ రెడ్డి వెనకనుంచి వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.

ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేతగానోడు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక.. నా మీద ఏడుస్తున్నారు. ఇక్కడ అరుణమ్మ ఏం చేసిందో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి తెలవదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులు ఇక్కడ ఉండి పనిచేసే వాళ్ళో కాదో ప్రజలకు తెలుసని అన్నారు. కానీ నేను గెలిచినా, ఓడినా మీతోనే ఉన్నా, ఉంటాను కూడా ఎందుకంటే ఇది నా ప్రాంతం అన్న మమకారం నాకు ఉన్నదిని ఇప్పుడున్న కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులలో ఎవ్వరు గెలిచిన తర్వాత జిల్లా వైపు కూడా చూడరు. పాలమూరు జిల్లాకు జైపాల్ రెడ్డి లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఏం చేశాడు చెప్పాలని ప్రశ్నించారు. ఓర్వలేక కక్ష్యగట్టి నా తండ్రి నర్సిరెడ్డిని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నాకు టికెట్ ఇవ్వకుండా కూడా ఇబ్బందులు పెట్టారని వాపోయారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి నన్ను నా తండ్రిని విడదీయాలని చూసారని అన్నరు. బీమా ప్రాజెక్ట్ ను తెచ్చింది మా నాన్న నర్సిరెడ్డి అని ప్రాజెక్టు మధ్యలోనే నక్సలైట్లు కాల్చి చంపారు అని అన్నారు.

Spread the love

Related News

Latest News