ఏపీ, తెలంగాణ నుంచి మరో ఇద్దరికి క్యాబినెట్ బెర్త్?

ప్రతిపక్షం, జూన్ 29: త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎంపీకి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అటు తెలంగాణ నుంచి కూడా మరో బీజేపీ ఎంపీకి కేంద్ర కేబినెట్‌లో స్థానం దక్కే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశముందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపులపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ అంశాలపై స్పష్టత రానుంది.

Spread the love

Related News

Latest News