Trending Now

బీఆర్​ఎస్​, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి ఖరారు.. అక్కడి నుండే పోటీ..?

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: నాగర్​కర్నూల్​ లోక్​సభ సీటును పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించేందుకు గులాబిబాస్​, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పొడిచిన బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ స్థానం బీఎస్పీకి కేటాయించబోతున్నట్లు బీఆర్​ఎస్​ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. . బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నాగర్ కర్నూల్ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నా లేకున్నా నాగర్‌కర్నూల్ నుంచే పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ ముందుగానే నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆయన క్షేత్ర స్థాయిలో పని కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు కారు పార్టీతో పొత్తు కలిసివస్తుందనే తనకు కలిసొస్తుందని ప్రవీణ్​ అనుకుంటున్నారు.

మొదట్లో గువ్వల పేరు పరిశీలన..

నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకుని.. ఆయన తనయుడిని బరిలోకి దింపారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి ఈ సారి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరును పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో సైతం ఆయన పేరును సూచనప్రాయంగా కేసీఆర్​ ప్రకటించారంటున్నారు.

Spread the love