సినీ నటికి లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై కేసు

ప్రతిపక్షం, జూన్ 15: సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్ తనను లైంగికంగా వేధించాడని ఓ సినీ నటి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నటి తెలిపిన వివరాల ప్రకారం, క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ సినిమా పాత్ర ఇప్పిస్తానని నమ్మించి వేధింపులకు పాల్పడ్డాడు. షూటింగ్ పూర్తయినప్పటికీ పారితోషికం చెల్లించకుండా, తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.

ఈ విషయమై బాధితురాలి తల్లి ఫోన్ చేసి ప్రశ్నించగా, ప్రసాద్ దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News