మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన: కాటం రవి గౌడ్

ప్రతి పక్షం చండూరు నవంబర్ 01: నల్లగొండ జిల్లా చండూరు మండలం చామలపల్లి గ్రామానికి చెందిన గిరి సతీష్ అకస్మాత్తుగా అనారోగ్యంతో మృతి చెందగా, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాటం రవి గౌడ్ వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు..మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, తక్షణ ఆర్థిక సాయంగా రూ.10,000/- నగదు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు..కష్టకాలంలో అండగా నిలిచిన రవి గౌడ్‌ను గ్రామస్తులు అభినందించారు..ఈ కార్యక్రమంలో చండూరు మండల కాంగ్రెస్ కార్యదర్శి కట్టేకోల రామేశ్వరావు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు రాచమల్ల మణిపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అలిశెట్టి కొండల్, నాయకులు రాచకొండ వెంకటాచారి, పెందోట ఎలాద్రి, గిరి శేఖర్, నేర్లకంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News