గీతా విద్యాలయ సంస్థలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు.

*పూల పండుగలో పాల్గొన్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు.

*ఆటపాటలతో సందడి చేసిన చిన్నారులు.

*బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక.

*గీతా విద్యాలయ సంస్థల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహ చారి .

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 10 : చండూరు పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ గీతా విద్యాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.పాఠశాల ప్రిన్సిపాల్ పోలోజు నరసింహ చారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థినులకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల దుస్తుల్లో, చేతుల్లో అందంగా పేర్చిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణంలో సందడి చేశారు. తంగేడు, గుమ్మడి, గునుగు, బంతి పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ వలయాకారంగా నిలబడి “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…” అంటూ పాటలు పాడుతూ ఆడిపాడారు. అనంతరం ప్రిన్సిపాల్ పోలోజు నరసింహ చారి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ అని అన్నారు. విద్యార్థి దశ నుండే మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News