మైనంపల్లి రోహిత్ రావు నాయకత్వంలో మెదక్ అభివృద్ధికి నూతన శకం

విమర్శలు చేసే ముందు మీ హయాంలో ఏం చేశారో చెప్పండి: మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నరేష్ గౌడ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 24: మెదక్ పట్టణ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకే కొందరు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నరేష్ గౌడ్ అన్నారు. అభివృద్ధి పనులపై విమర్శలు చేసే ముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పట్టణానికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాందాస్ చౌరస్తాలో చేపడుతున్న సుందరీకరణ పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని, పనులు పూర్తికాకముందే ప్రమాదకరమైన రాడ్లు, మేకులంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. నిర్మాణ పనుల తుది రూపాన్ని పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించిన సూచనలను స్వాగతిస్తామని, భద్రత విషయంలో మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని స్పష్టం చేశారు.

గతంలో మున్సిపల్ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారు తమ హయాంలో మెదక్ అభివృద్ధికి చేసిన కృషిని ముందుగా ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నాయకత్వంలో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, చౌరస్తాల సుందరీకరణతో పాటు పలు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.మెదక్ పట్టణానికి ఆధునిక రూపు తీసుకురావాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మున్సిపల్ పాలకవర్గం ఆయన మార్గదర్శకత్వంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రాజకీయ విమర్శలతో అభివృద్ధిని అడ్డుకోలేరని, మాటలతో కాకుండా చేపట్టిన అభివృద్ధి పనులతోనే విమర్శలకు సమాధానం చెబుతామని డి. నరేష్ గౌడ్ పేర్కొన్నారు.

Related News

Latest News