సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరం

ఇంటింటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 11: సీఎం రిలీఫ్ ఫర్డ్ పేద ప్రజలకు ఒక వరo మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణంలోని 31 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అర్హులైన 33 మంది లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు బొజ్జ పవన్, భూపతి రాజ్, బాలరాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News