మద్యం మానాలని భార్య సూచన.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

ప్రతిపక్షం, జూలై 04: హైదరాబాద్‌లోని బాచుపల్లి పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని చెప్పిన భార్యను భర్త హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బాచుపల్లి సీఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ మద్యానికి బానిసై తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య భార్గవిని వేధించేవాడు. భర్త మద్యం మానాలని భార్గవి పలుమార్లు కోరినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలో బాలకృష్ణ భార్గవిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News