ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం జగిత్యాలలో విజయ సంకల్ప సభలో మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మాట్లాడుతూ.. ‘తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. రాష్ట్రంలో ప్రజలు అబ్ కి బార్.. 400 పార్ అంటున్నారు. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. మల్కాజిగిరి రోడ్ షోలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు’ అని అన్నారు.