శంకర్‌పల్లిలో విషాదం.. ఉరివేసుకుని భార్యాభర్తల ఆత్మహత్య

ప్రతిపక్షం, జూన్ 29: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు ఒకే దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్వాడ గ్రామానికి చెందిన సాయి (32), పద్మ ఏడాది క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. సాయి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, పద్మ గృహిణిగా ఇంటి వద్దే ఉండేది. ఆదివారం వీరిద్దరూ తమ నివాసంలో ఒకే దూలానికి ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దంపతులకు ఆరు నెలల పసికందు ఉండటం స్థానికులను మరింత కలచివేసింది.

ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News