నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్ 9 : శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ లో గల నిర్మల్ మున్నూరు కాపు మిత్ర మండలిలో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమం, ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ ఇంట, సుఖ సంతోషాలతో, సిరి సంపాలతో నిండిపోవాలని, భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జాతీయ విత్తన శుద్ధి డైరెక్టర్ అయ్యన్నగారి భూమయ్య, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎర్రవోతు రాజేందర్, మిత్ర మండలి అధ్యక్షులు పుప్పాల రమేష్, ప్రధాన కార్యదర్శి కొబ్బయి శంకర్, సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.