Trending Now

శివనామస్మరణతో మార్మోగుతున్న కైలాసగిరులు.. భారీగా భక్తుల రద్దీ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ మహా శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, ద్రాక్షరామం, అమరావతి, వేములవాడ, కీసర, రామప్ప, కాళేశ్వరం, వరంగల్ వేయిస్తంభాల ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆయా ఆలయాల్లో వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లోని శైవ క్షేత్రాలకు భక్తులు క్యూకడుతున్నారు.. పరమ శివుడి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమరావతి అమరేశ్వర ఆలయం, కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర ఆలయాల్లో భక్తులు రద్దీ భారీగా ఉంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉచిత దర్శనానికి నాలగు గంటల సమయం పడుతోంది. శ్రీశైలంలో రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం నిర్వహించనున్నారు.

Spread the love