Trending Now

మోడీ ప్రభుత్వ ఎత్తుగడను వ్యతిరేకించండి!

ముస్లిం వ్యతిరేక, లౌకిక వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఏఏ)   వేగవంతంగా అమలు చేసే దిశగా మోడీ ప్రభుత్వ ఎత్తుగడను వ్యతిరేకించండి! 

11 డిసెంబర్ 2019న పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ (సవరణ) చట్టం ( సిఏఏ)ని  శీఘ్రంగా అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, అది కొనసాగించలేకపోయింది.  నాడు దేశవ్యాప్తంగా భారీ నిరసనల కారణంగా దానిని నిలిపివేయవలసి వచ్చింది.  అదేవిధంగా ప్రపంచ మహమ్మారి కరోనా కూడా కొంత కలిసి వచ్చింది. ఇప్పటి వరకు, పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) కి  సంబంధించి సుప్రీంకోర్టులో వివిధ కేసులపై మోడీ ప్రభుత్వం స్పందిస్తూ, సిఏఏ కి సంబంధించిన రూల్స్ ఇంకా రూపొందించబడలేదు అని తెలియజేసింది.  ఈ నేపథ్యంలోనే, రామ మందిర ప్రతిష్ఠాపన కొనసాగింపుగా, ఎన్నికల నోటిఫికేషన్ ముందు రోజున మరియు ముస్లింలకు వ్యతిరేకంగా గరిష్ట మెజారిటీ హిందుత్వ  వాదాన్ని రెచ్చగొట్టి సృష్టించే లక్ష్యంతో, 11 మార్చి 2024న, మోడీ ప్రభుత్వం.  పౌరసత్వ సవరణ చట్టం( సి ఏ ఏ)పై పెండింగ్‌లో ఉన్న అనేక కేసులపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ,  పౌరసత్వ సవరణ చట్టం రూల్స్, 2024 నోటిఫికేషన్‌తో ముందుకు వచ్చింది.

సహజంగానే,  పౌరసత్వసావరణ చట్టం( సి ఏఏ)2014కి ముందు భారతదేశానికి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి 6 ముస్లిమేతర కమ్యూనిటీలకు (బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, హిందువులు, పారసీకులు, సిక్కులు )భారతీయ పౌరసత్వాన్ని పొడిగిస్తుంది, అయితే ముస్లింలను పూర్తిగా మినహాయించింది.  2019-20లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, సంస్థలు మరియు ఉద్యమాలు  బహుముఖంగా విస్తృతంగా  జరిగాయి. ముస్లింలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్న ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాకుండా ఉద్యమకారులు దీని వెనుక ఉన్న మతతత్వ హిందూ రాజ్య లేక దేశ ఎజెండాను బహిర్గతం చేసారు. 2019 పౌరసత్వ సవరణ చట్టం(  సిఏఏ) పౌరసత్వ చట్టం1955ను ఉల్లంఘించడమే కాకుండా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కుతోపాటు ఆర్టికల్ 25 నుండి 28 వరకు వివరించిన విధంగా రాజ్యాంగం యొక్క లౌకిక స్వభావాన్ని బలహీనపరుస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం, పౌరసత్వం మతపరమైనదికాదు- రాజ్యాంగం మతం పట్ల తటస్థమైనది. పౌరసత్వానికి మతాన్ని చొప్పించడం రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణానికి విరుద్ధంగా ఉంటుంది.

అయితే, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్( ఆర్ఎస్ఎస్), ప్రపంచంలోనే అతిపెద్ద మరియు సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఫాసిస్ట్ సంస్థ అనేది మనకు తెలిసిన విషయమే. దాని రాజకీయ సాధనం భారతీయ జనతా పార్టీ. భాజపా ని ఉపయోగించి, ఇప్పుడు హిందూ రాజ్యం, లేదా రామరాజ్యం అని పిలవబడే దాని అంతిమ లక్ష్యం వైపు  వెర్రి వేగంతో  ఉరకలు వేస్తున్నది. 

మాజీ చీఫ్ గోల్వాల్కర్ ప్రవచించిన ప్రకారం, ముస్లింలు ‘దేశానికి’ ప్రధమ శత్రువులు.  ఈ దృక్కోణంలో చూస్తే, ఖచ్చితంగా చెప్పాలంటే, పౌరసత్వ సవరణ చట్టం( సి ఏఏ )లో వ్యక్తమైనది ముస్లింల  పట్ల పూర్తి వివక్ష  పూర్తి ‘చట్టబద్ధీకరణ’కనబడుతున్నది.  ఆ విధంగా, ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల ప్రకారం ఆర్టికల్ 370 రద్దు, కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలోనే రామమందిరాన్ని నిర్మించి ప్రారంభించడం, ఏకీకృత పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్) మొదలైన ముస్లిం వ్యతిరేక మరియు ఇస్లామోఫోబిక్ ఎత్తుగడల పరంపర కొనసాగింపుగా, మోదీ పాలన ఇప్పుడు దాని ‘మిషన్ 400’ సాధించడానికి మెజారిటీ పోలరైజేషన్‌ను వేగవంతం చేస్తోన్నది. అంటే రాబోయే ఎన్నికల్లో పార్లమెంటులో 400 సీట్లను కైవసం చేసుకోవడం  దాని లక్ష్యం. ఇందు ఇందు కొరకు 400 పార్లమెంటు సీట్లు సాధించటం పౌరసత్వ సవరణ చట్టం అనేది తాజా ఫాసిస్ట్ ఆయుధం.

ఇప్పుడు, సార్వత్రిక ఎన్నికల ముందు, మోడీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం( సి ఏ ఏ)  నిబంధనలను హడావిడిగా నోటిఫై చేయడంతో, భారతదేశం అంతటా నిరసనలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో కొన్ని ప్రతిపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో  పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏను) అమలు చేయబోమని ప్రకటించాయి.  అయితే, ఇప్పటికే నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం ఇది కష్టంగా కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం( సి ఏ ఏ)  రూల్స్, 2024 ప్రకారం, పౌరసత్వ సవరణ చట్టం అమలు ప్రక్రియ మొత్తం కేంద్రంలోని కార్పొరేట్-కాషాయ ఫాసిస్ట్ పాలన యొక్క దృఢమైన పరిపాలనా పట్టులో ఉంది. దరఖాస్తులను స్వీకరించడం నుండి, వాటి ప్రాసెసింగ్‌ నేపథ్యంతో పాటు.. పౌరసత్వం మంజూరు చేయడం వరకు, పౌరసత్వం మంజూరు చేయడం వంటి మొత్తం ప్రక్రియలు, సెన్సస్ ఆపరేషన్స్ అధికారులు, ఇంటిలిజెన్స్ బ్యూరో(ఐబి)  అధికారులు, పోస్ట్ మాస్టర్ జనరల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అధికారులతో కూడిన కమిటీలకు అప్పగించబడతాయి.

అన్నీ ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కేంద్రం రాష్ట్రాన్ని సంప్రదించాల్సిన 2009 పౌరసత్వ నిబంధనలు ఇప్పుడే నోటిఫై చేయబడిన పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల ప్రకారం పూర్తిగా ఉల్లంఘించబడ్డాయి. అందువల్ల,  పౌరసత్వ సవరణ చట్టం వలన సమాఖ్య స్ఫూర్తి  యొక్క లక్ష్యం దెబ్బతినటమే కాక, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు పాలనలోకి నెట్టబడుతున్నది. ఈ విధంగా రాజ్యాంగం యొక్క ఫెడరలిజం స్ఫూర్తి దెబ్బతింటున్నది.  ఇంకా, రాష్ట్రాల అధికారాలు కూడా చాలా పరిమితం చేయబడ్డాయి. ఆర్టికల్ 256 ప్రకారం.. పార్లమెంటు ఆమోదించిన చట్టాల ప్రకారం రాష్ట్రాలు ఆమోదించి పాలించడం తప్పనిసరి కాబట్టి, ఆర్టికల్ 356ని ఉపయోగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చేప్రతిఘటనను అధిగమించడానికి ఫాసిస్టులకు ఎటువంటి  అడ్డంకులు లేవు.

నిస్సందేహంగా, నయా ఉదారవాద కాలంలో ఫాసిజం ప్రపంచ స్థాయిలో ఇస్లామోఫోబియాను దాని సైద్ధాంతిక ప్రాతిపదికగా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది. యూరోప్ అంతటా, అమెరికాలో, పాలస్తీనియన్ల జియోనిస్ట్ నిర్మూలనలో, ఆసియాలోని అనేక దేశాలలో “డి-ఇస్లామైజేషన్” మరియు “ముస్లిం వ్యతిరేకత” అనేది మొత్తం నయా-ఫాసిస్ట్ పార్టీలు.. పాలక పాలనలలో ఇష్టమైన ఇతివృత్తంగా మారింది. భారతదేశంలో, ఈ దుర్మార్గపు చర్యలో ఆర్ఎస్ఎస్/ భాజపా గత కాలం నుండి పెద్ద ఆచార్యుడుగా వ్యవహరిస్తున్నారు. భారత్‌లోని పొరుగు దేశాల్లో మైనారిటీలపై జరుగుతున్న అణచివేతపై మొసలి కన్నీరు కారుస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్తలు, మయన్మార్‌ నుంచి అత్యంత వేధింపులకు గురవుతున్న రోహింగ్యా శరణార్థులు, పాకిస్థాన్‌కు చెందిన అహ్మదీలు, తమిళనాడులోని శిబిరాల్లో మగ్గుతున్న వేలాది మంది శ్రీలంక శరణార్థులు భారత పౌరసత్వం కొరకు ఉన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న ఆర్ఎస్ఎస్ /భాజపా ఫాసిస్ట్ ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేయడం.. ఈ ముస్లిం వ్యతిరేక చర్యను ప్రతిఘటించడం, ఓడించడం ప్రజాస్వామ్యవాద, అభివృద్ధి కాముకుల ప్రజలందరిపై ఉంది.

పౌరసత్వ సవరణ చట్టం ( సి సి ఏ) యొక్క పరిణామాలు ఎన్ ఆర్ సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఇది అస్సాంలో మాత్రమే 4 మిలియన్ల పౌరసత్వాన్ని తీసివేయగలదని భావిస్తున్నారు) అది భారతదేశాన్ని మార్చగలదు (ఇప్పుడు మతం ఆధారంగా “ప్రజాస్వామ్య తల్లి”గా పౌరసత్వం మార్కెట్ చేయబడుతోంది.  ), ఫాసిస్ట్ భయాందోళనల యొక్క నిజమైన గదిలోకి, లక్షలాది మంది ప్రజలు  కనీస స్థితిలేని, శరణార్థులు  ఉన్నారు. వారికి మానవ ప్రాథమిక మానవ హక్కులు కూడా లేని “ఆశ్రయం కోరేవారు” లేదా “చొరబాటుదారులు” అవుతున్నారు. ఫాసిస్ట్ రాజ్యాధికారం కాషాయ కార్పొరేట్ గుండాల వీధి అధికారం రెండింటి దయతో, గుండాలచే నిర్వహించబడుతున్నది.  భారతదేశంలోని చాలా మంది ముస్లిం వలసదారులు బలవంతంగా బహిష్కరించబడతారని లేదా ఇప్పటికే పని చేయడం ప్రారంభించిన  తరలింపు కేంద్రాలు(“ట్రాన్సిట్ క్యాంపులు”)  నిర్బంధ కేంద్రాలు(“డిటెన్షన్ సెంటర్ల)లో” ఉంచబడతారనే భయం కూడా అణగారిన ముస్లిం వర్గాల్లో ఉంది.

ఈ భయంకర  సంక్లిష్ట తరుణంలో, ఈ మెజారిటీ మతోన్మాద కాషాయ ఫాసిస్ట్ ఎత్తుగడ బాధితులకు సంఘీభావంగా నిలవడం లౌకికవాదుల మరియు ప్రజాస్వామ్యాన్ని సమర్థించే ప్రజలందరి  ముఖ్యమైన కర్తవ్యం.  పౌరసత్వ సవరణ చట్టాన్ని అతిక్రమించడం వల్ల తలెత్తే ముప్పును నివారించడానికి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దాని ఫాసిస్ట్ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ /భాజపా ని ఓడించడానికి  నడుం బిగించి ముందుకు సాగడమే ఏకైక  మార్గం. అన్ని ప్రజాస్వామ్య శక్తులు.. అణగారిన ముస్లిం మైనారిటీల ఉద్యమాలు మరియు దళితులు, ఆదివాసీలు మరియు మహిళా కార్మికులు, రైతులు మరియు అన్ని రంగాల శ్రామిక ప్రజానీకం, ​​యువత, విద్యార్థులతో సహా అన్ని అణగారిన వర్గాల వారు దీనిని తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 

పీజే జేమ్స్
జనరల్ సెక్రటరీ
సిపిఐ (ఎం ఎల్ )రెడ్‌స్టార్

స్వేచ్చానుసరణ : 
మన్నవ హరిప్రసాద్, పోలిట్ బ్యూరో సభ్యుడు సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్

email: mannavahariprasad@gmail.com

Spread the love

Latest News