Trending Now

మోడీ ‘పెద్దన్న’లా సహకరించాలి.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించింనందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Spread the love

Latest News