కిలోన్నర గంజాయి, బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం
ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్పట్టణంలో పోలీసులు శుక్రవారం కిలోన్నర గంజాయి పట్టకున్నారు. పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఇద్దరు యువకులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పట్టణానికి చెందిన చుక్క అనిల్, గుగులోత్ సంతోష్ లను అరెస్టు చేశారు.
గంజాయి ఇతర మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇద్దరు నిందితులు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ సిబ్బంది. హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కిలోన్నర గంజాయితో పాటు టీవీఎస్ ఎక్సెల్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను విచారించగా వీర్ల గడ్డ తండాకు చెందిన బుక్య రమేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారని సీఐ చెప్పారు. ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్ముతురన్నారని తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారనే దానిపై పర్యవేక్షించాలని అన్నారు