ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల డ్యామేజీ, పటిష్టతపై అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆరుగురితో కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధక్ష్యతన ఏర్పడిన ఈ కమిటీలో మరో ఐదుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు. నాలుగు నెలల్లో ఈ మూడు బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అథారిటీ పాలసీ-రీసెర్చ్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న రాసిన లేఖలో పేర్కొన్నారు.