Trending Now

స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం బాక్స్ లను భువనగిరి లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం భద్రత మధ్యన ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్ కుమార్, స్పోక్స్ పర్సన్ వచన కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.

Spread the love

Related News