కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బోథ్ మాజీ ఎమ్మెల్యే బాపు రావు
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్, 15 : ఆదిలాబాద్ జిల్లా బోర్డ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాపూరావు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి.. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బోథ్ నియోజకవర్గంలో పనిచేసిన ఆయనకు శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో తొలిత కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ తర్వాత వెనువెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
బాపూరావు ఆశించినట్లే బీజేపీ అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ టికెట్లు కూడా ఇవ్వకపోవడంతో ఆయన గత కొంతకాలంగా బీజేపీ సంస్థ గత కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సోమవారం నిర్మల్ కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్ ల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ కాంగ్రెస్ సీనియర్ యువజన నాయకులు సయ్యద్ అర్జుమంద్ లు ఉన్నారు.