Trending Now

విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం..

జైపూర్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం లభించింది. జైపూర్‌లోని మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఏప్రిల్ 18న ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా కింగ్ కోహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మైనపు విగ్రహం ఫస్ట్‌లుక్‌ను మ్యూజియం అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జైపూర్ వ్యాక్స్ మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ”గత ఏడాది కాలంగా విరాట్ కోహ్లీ విగ్రహాన్ని తయారు చేయాలని పర్యాటకుల నుండి డిమాండ్ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత విరాట్‌కు పిచ్చి ఫ్యాన్స్ అని.. కాబట్టి కింగ్ కోహ్లి విగ్రహం కచ్చితంగా మ్యూజియంలో ఉండాలని నా అభిప్రాయం. ఇప్పుడు విరాట్ పిల్లలకు యువత్‌కు స్పోర్ట్స్ ఐకాన్‌గా మారారు, అతని విగ్రహాన్ని ప్రదర్శించడం, అతనిని గౌరవించడం కంటే మెరుగైన సందర్భం ఏముంటుందని.. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని” ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోనూ కోహ్లీ మైనపు విగ్రహం ఉంది. విరాట్ మైనపు దిష్టిబొమ్మ బరువు 35 కిలోలు కాగా, ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. విరాట్ దుస్తులను బాలీవుడ్ డిజైనర్ బోద్ సింగ్ తయారు చేశారు. మ్యూజియంలో ఇప్పటివరకు మొత్తం 44 మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.

Spread the love

Related News