Trending Now

కాంగ్రెస్​ అభ్యర్థుల ఖరారు..?

నేడు సీఈసీ భేటీ అనంతరం ప్రకటన

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణాలో వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు దాదాపుగా పూర్తి అయ్యిందని, బుధవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో పేర్లు ప్రకటిస్తారని టీపీసీసీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే లోక్​సభ అభ్యర్థులను బీజేపీ, బీఆర్ఎస్​ ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ మాత్రం రెండు విడతల్లో 9 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఆ 8 స్థానాల్లో పార్టీలోని ముఖ్యనేతలు, వారి బంధువులు పోటీ పడుతున్నారు. ముఖ్యనేతలు, వారి కుటుంబీకులకు టికెట్​ కోసం ప్రయత్నిస్తుండడంతో పలు మార్లు అధిష్టాన దూత దీపాదాస్​వారితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయం తీసుకుంది. దీనితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రవేంత్​రెడ్డి సైతం రంగంలోకి దిగి టికెట్​ కోసం పోటీ పడుతున్న సీనియర్​ నేతలతో చర్చించి సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో 16మంది ఆశావాహులు పోటీపడుతున్నారు.

అయితే పోటీ పడుతున్న ఆశవాహులపై ఇటీవల సర్వేలు నిర్వహించారు. దీనితోపాటు సామాజిక వర్గాలను సైతం పరిశీలనలోకి తీసుకొని 8 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఆదిలాబాద్​కు డాక్టర్​ సుమలతను పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. అయితే ఆత్రం సుగుణ.. డాక్టర్ సుమల పోటీ పడ్డారు. నిజామాబాద్‌లో జీవన్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది. ఎవరి స్టైయిల్‌లో వాళ్లు అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కరీంనగర్‌ స్థానం తమకే కేటాయించాలని ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్‌ పట్టుబడుతున్నారు. ఇద్దరిలో ప్రవీణ్‌ రెడ్డి పేరు ఫైనల్​ అయ్యిందని గాంధీభవన్​ వర్గాల సమాచారం.

వరంగల్‌ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ మరోసారి రేసులో నిలిచారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన దయాకర్‌.. ఛాన్స్ ఇస్తే గెలుపుని కానుకగా ఇస్తానని ధీమాగా చెబుతున్నారు. అటు దొమ్మటి సాంబయ్య తనకే సిటివ్వాలని పట్టుబడుతున్నారు. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని ససునూరి దయాకర్​కు మరో మారు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఖమ్మం బరిలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ పడ్డారు. అయితే భట్టి విక్రమార్క అన్న మల్లురవికి నాగర్​కర్నూల్​ టికెట్​ ఇవ్వడంతో ఇక్కడి నుంచి వేరే సామాజిక వర్గాని అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సోదరుడు ప్రసాద్​రెడ్డి పేరు ఖరారు చేశారు.

ఇక భువనగిరిపై ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి చామల కిరణ్‌ కుమార్‌. మొన్నటిదాకా కోమటిరెడ్డి లక్ష్మి తోఎ పాటు కంచర్ల చంద్రశేఖర్​రెడ్డి టికెట్​ కోసం పట్టుపడుతున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్​ దాదాపు ఖాయమంటున్నారు. మెదక్‌లో మైనంపల్లి హన్మంతరావు – నీలం మధు పోటీ పడగా, నీలం మధు పేరు ఖరారు అయినట్లు సమాచారం. అటు హైదరాబాద్‌ సెగ్మెంట్‌లో సుప్రీం కోర్టు వకీల్​గా ప్రాక్టీస్​ చేస్తున్న షబానా తబుస్సుం పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆశామాషిగా కాకుండా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపికకు శ్రీకారం చుట్టింది. రాజకీయ సునీల్​కొనుగోలు 8 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై తాజాగా సర్వే నిర్వహించి సర్వేను అధిష్టానానికి ఇచ్చినట్లు సమాచారం. ఈ సర్వేను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్​ దీనితో పాటు వ్యక్తిగత పరపతి, ఆర్థిక పరిస్థితి, సామాజిక సమీకరణాలు, ఆధారంగా ఎంపిక చేసిందంటున్నారు.

Spread the love

Latest News