Trending Now

చిక్కుల్లో మిల్కీ బ్యూటీ.. సైబ‌ర్ క్రైమ్ నుండి నోటీసులు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్ విభాగం తమన్నాకు సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులు ఇచ్చింది. దీంతో ‘వయాకామ్’ మీడియాకు రూ.కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. ఈ మేరకు తమన్నాను ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని మహారాష్ట్ర సైబర్ విభాగం కోరింది. నటుడు సంజయ్ దత్‌కి కూడా ఇదే కేసులో సమన్లు ​​ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరూ ఆ యాప్ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి ఆదరణ ఉన్న హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. పలు వెబ్ సిరీస్ లలో ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా రీసెంట్ గా అయితే సూపర్ స్టార్ “జైలర్” లో కనిపించింది. అలాగే మరో పక్క కన్నడ చిత్రం “బాక్” తో ఈ మే లో రాబోతుంది. అయితే తమన్నా వీటితో పాటుగా పలు ఎండోర్స్ మెంట్స్ కి కూడా ప్రమోట్ చేస్తుంది అని తెలిసిందే.

Spread the love

Related News