కాంగ్రెస్, వామపక్షాల పొత్తు ఖరారు..
ప్రతిపక్షం, ఏపీ: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు జట్టు కట్టగా.. తాజాగా ఏపీ రాజకీయాల్లో మరో పొత్తు పొడిచింది. కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఎట్టకేలకు పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఇవాళ పొత్తు ఖరారు అయ్యింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అధికారికంగా ప్రకటించారు.