Trending Now

అడుగడుగునా గోతులు.. గగ్గోలు పెడుతున్న జనాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూలై 01 : నిర్మల్ పట్టణం ప్రస్తుత పురపాలక పక్షం పట్టణం లోని పలు వీధిలలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతోంది. మరి కొన్ని వీధులలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం తో అప్పుడప్పుడు కురిసే వర్షాలకు రోడ్లన్నీ బురదతో నిండి గుంతలమయ మవుతున్నాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలోని అంతర్గత వీధులలోని రోడ్లు పాడైపోయి నడువడమే నరకంగా మారుతుండగా, వాహన చోదకులు ఆ రోడ్ల గుండా వెళ్ళడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇకపోతే పట్టణ వీధులలో సంచరించే ఆటోలు సదరు రోడ్లు పాడైన వీధులకు రావడానికి ముందుగా నిరాకరిస్తూ ఆ తర్వాత కిరాయి అధికంగా ఇస్తే వస్తామంటున్నారు.

ప్రాంతంలో వర్షపు నీళ్లతో నిండి గోతులమయమైన రోడ్డు బురదతో నిండి గోతులు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్క సారి భారీ వాహనాలు సైతం ఈ గోతులలో ఇరుక్కుపోయి రాకపోకలకు గంటలు తరబడి అంతరాయం కలుగుతోంది. రోడ్డులపై ఈ స్థితి ఈ విధంగా ఉండగా, ప్రధాన, అంతర్గత స్థితి ఈ విధంగా ఉండగా ఇరుకు రోడ్ల పైన అయితే నడవడం నరకంగా రోడ్లు ఇరుకుగా ఉండడంతో పాటు సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పట్టణంలోని చైన్ గేట్ నుంచి పాత మార్కెట్, ఈద్గాం చౌరస్తా నుంచి మౌలానా ఆజాద్ చౌక్ వరకు, గాంధీ చౌక్ నుంచి బుధవార్ పేట్ చౌక్ కొరకు, పాత బస్టాండ్ నుంచి పింజారి గుట్ట వయా అంబేద్కర్ చౌక్ వరకు వెళ్ళే రోడ్లన్నిపాడై పోయి పాదచారులు, వాహనచోదకులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అంతర్గత రోడ్లతోపాటు ప్రధాన రోడ్లు కూడా వీటిని మరిపించే తరహాలో తయారయ్యాయి. పట్టణ శివారు, కాలనీలు అయినా అస్రా కాలనీ, మౌలానా ఆజాద్ నగర్, ఆదర్శ్ నగర్ ,సోఫీ నగర్, ప్రియదర్శిని నగర్, రాంరావు బాగ్, ఈద్గాం, విశ్వనాధ్ పేట్, గాజులపేట్,, కురన్న పేట్ వీధులలో రహదారుల తోపాటు మరెన్నో సమస్యలను స్థానికులు ఎదుర్కొంటున్న పాలకులు అధికారులలో ఎలాంటి చలనం లేకపోవడం పలు
అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. పురపాలక సంఘం వీటికి తోడుగా ఈరోడ్లపై నిండిపోయిన మట్టి, చెత్తాచెదారం తో పాటు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాల కింద లక్షలాది రూపాయలు వెచ్చించి పట్టణంలోని వార్డులలో సిసి రోడ్లు మురికి కాలువలు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రణాళిక బద్ధమైన రీతిలో ముందుకు వెళ్తుండగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై చేపట్టిన పనులలో నాణ్యత లోపించడంతో వారు అధికారిక నిబంధనలను తిలోదాకాలిచ్చి మోసగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడుకొని ప్రాంతాలలో సీసీ రోడ్లు నిర్మించిన కొన్ని రోజులకే టెలికాం శాఖ వారు మిషిన్ మిషన్ భగీరథ వారు ఇరువైపుల తవ్వకాలు జరపడంతో సీసీ రోడ్లు వేసిన అవి వెయ్యనట్లే మట్టి రోడ్లుగా రూపం ఎత్తాయి. దీంతో వర్షాకాలం వస్తే చాలు ఆ ప్రాంతాలలో అడగడుగునా గోతులు ఏర్పడి నడవడం నరకంగా మారుతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో ఉన్న ఇలాంటి సమస్యలను గుర్తించి వెంటనే ప్రజా ప్రతినిధులు అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటారని పట్టణ వాసులు కోరుతున్నారు.

Spread the love

Related News