Trending Now

సైబర్ నేరాలపై అవగాహన..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 10: సైబర్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించే పండుగను త్రి టౌన్ పోలీసులు సిద్దిపేట అర్బన్ మండలం జడ్పిహెచ్ఎస్ బక్రిచెప్యాలలో నిర్వహించారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ అంబాసీడార్ ప్లాట్ ఫారం కోర్సు బక్రిచెప్యాల విద్యార్థులు ఆన్ లైన్ లో ఐదురోజులో పూర్తి చేశారు. అందుకుగాను ఎం. సఫూర, ఎం.లోకేష్, ఎం. స్నేహ, డి. చైతన్య గుర్తింపుగా ఈ విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు సైబర్ అంబసిడార్ బ్యాడ్జీలు పంపిణీ చేశారు. సైబర్ నేరాలపై అవగాహన, ముందస్తు జాగ్రత్తలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్, పాఠశాల హెచ్ ఎం నాగేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు అనిల్ కుమార్, సుహాసిని, రమాదేవి, శ్రీశైలం, లక్ష్మయ్య, సునీత, ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పూజ, చంద్రకాంత్, రఘుపతి, కర్ణాకర్, కళ్యాణ్, బాలస్వామి పాల్గొన్నారు.

Spread the love

Related News