Trending Now

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ మంత్రి హరీష్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలోని, చిన్నకొడూర్ మండలంలో 500 మంది మహిళలకు, నారాయణ రావు పేట మండలంలోని వివిధ గ్రామాల 300 మంది మహిళలకు కుట్టు మిషన్ లను పంపిణి చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం శుభదినం మూడు పండుగలు ఒకేసారి జరుపుకుంటున్నామని అన్నారు. ఒకటి మన గొప్ప పండుగ మహా శివరాత్రి అయితే, రెండోది మహిళల పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మూడోది మీ మహిళందరికీ కుట్టు మిషన్లు ఇచ్చే పండుగ అన్నారు.

ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన మాట ప్రకారం కొంత కష్టం అయినా మీకు కుట్టు మిషన్ లు పంపిణీ చేయడం జరిగిందని.. శిక్షణ తీసుకున్న మిగిలిన మహిళలకు కూడా త్వరలో మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్య లను గాలికి వదిలేసిందని, అనాలోచితంగా వ్యవహరిస్తోందని అన్నారు. గత ఎండాకాలం ఈ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయించి చెరువుల్ని, కుంటల్ని, చెక్ డ్యామ్ లను నింపుకున్నాం. నిండు ఎండా కాలం లో పంటలు ఎండిపో కుండా కాపాడుకున్నాం. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయమే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడుప్రచారం చేస్తూ నీళ్లు విడువడం లేదన్నారు. సిద్దిపేట అభివృద్ది కోసం, ఇక్కడి ప్రజలను కాపాడుకోవడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ఎంతదాకయినా కొట్లాడుతని హరీష్ రావు అన్నారు. అంతకు ముందు కోటి లింగాల ఆలయంలో శివునికి అభిషేకం చేశారు. ఈ సమావేశం నాయకులు రాజనర్సు, రవీందర్ రెడ్డి, మాణిక్య రెడ్డి, ఆంజనేయులు, అలకుంట మహేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love