Pawan gives green signal for the shooting of ‘Hari Hara Veeramallu’: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్‌లో మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మూవీ తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఏడాది కాలంగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. అయితే తాజాగా తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిసినట్లు తెలుస్తోంది. ఈనెల 23న విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సహా కీలక నటీనటులు పాల్గొంటారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయనున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియాగా తెరకెక్కనున్న ఈ మూవీ ఈ ఏడాది చివరికి ప్రేక్షకుల ముందుకు రానుంది.