Trending Now

IPL 2024: నేడు గుజరాత్‌తో ఢిల్లీ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచులు జరగ్గా.. గుజరాత్‌దే పైచేయిగా ఉంది. గుజరాత్ రెండింట్లో, ఢిల్లీ ఒక మ్యాచులో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో గుజరాత్ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఢిల్లీ నాలుగు పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.

బట్లర్ బాదేశాడు.. కోల్‌కతాపై రాజస్థాన్ విక్టరీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. జోస్ బట్లర్ 107*(60) ధాటిగా ఆడటంతో రాజస్థాన్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. రియాన్ పరాగ్ 34(14) మినహా టాప్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటర్లు ఎవరూ సరైన భాగస్వామ్యం అందించలేదు. కానీ బట్లర్ ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ గెలిపించాడు. దీంతో కోల్‌కతాలో నరైన్ సెంచరీ వృథా అయింది.

రాజస్థాన్ రాయల్స్ రికార్డ్..

కేకేఆర్‌పై రాజస్థాన్ రాయల్స్ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. బట్లర్ పుణ్యమా అని ఈ సీజన్‌లో అత్యధిక లక్ష్యాన్ని (224) ఛేదించిన జట్టుగా నిలిచింది. అయితే RRకు ఇంత భారీ స్కోర్‌ను ఛేజ్ చేయడం కొత్త కాదు. 2020లో పంజాబ్‌పై కూడా 224 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో IPL చరిత్రలోనే రెండుసార్లు భారీ టార్గెట్‌ (224)ను ఛేదించిన ఏకైక జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.

Spread the love

Related News