Trending Now

నగరాభివృద్ధి అడ్డుకునేవారికి.. నగర బషిష్కరణ శిక్ష : సీఎం రేవంత్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ మహానగరంలో మెట్రో విస్తరణ అడ్డుకోవాలని, అలాగే హైదరాబాద్​ నగరాభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి నగర బహిష్కరణ శిక్ష విధించాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నగర ప్రజలకు సూచించారు. ఇలాంటి వారికి సీఎం హెచ్చరికలు సైతం జారీ చేశారు. శనివారం సాయంత్రం భైరామల్​గూడలో మల్టీ ఫైఓవర్​ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుందన్నారు. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారని, మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తాం.

ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మాపై ఉంది. మురికి కూపంగా మారిన మూసీ పరివాహక ప్రాంతాన్ని రూ.40 నుంచి 50 వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని రేవంత్​ తెలిపారు. లండన్ థెమ్స్ నదీపరివాహక ప్రాంతంలా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైబ్రాంట్ తెలంగాణ 2050లో భాగంగా త్వరలోనే 55 కి.మీ మేర మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం354 కి.మీ ల రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోపల సబర్బన్ హైదరాబాద్ కింద రేడియల్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తాం.అందరి సలహాలు, సూచనలతో వైబ్రాంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నామని సీఎం వెల్లడించారు.

Spread the love

Related News

Latest News