ప్రతిపక్షం, జూన్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ‘సర్’ ప్రక్రియను తమ పార్టీ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లా దొంగ ఓట్లతో గెలవాలని తాము భావించడం లేదన్నారు.
రైతుభరోసా నిధులు విడుదల చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన కేటీఆర్, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగించి దొంగ ఓట్లను చేర్చే ప్రయత్నాలు జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటరు జాబితాలతో చెలగాటం ఆడొద్దని ఆయన సూచించారు.
















