Rain Alert: అలర్ట్.. నేడు, రేపు భారీ వర్ష సూచన

Rain Alert For Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌తో పాటు రంగా రెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోని కర్నూల్, నంద్యాల తదితర జిల్లాల్లో పలుచోట్ల వర్షం పడుతోంది. రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Related News

Latest News