Trending Now

ఎన్నికల బాండ్ల చిట్టా విప్పిన ఈసీ.. టాప్‌లో బీజేపీ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేసింది. ఎస్‌బీఐ అందించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రం విడుదల చేసింది.763 పేజీలతో కూడిన ఎలక్టోరల్‌ బాండ్ల డొనేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ వేదికగా ఈసీ విడుదల చేసింది. దీని పరంగా ఏయే రాజకీయ పార్టీలకు ఎన్ని డొనేషన్స్ వచ్చాయి ? వాటిని ఇచ్చిన వారెవరు? అనే కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

పార్టీలవారీగా విరాళాల లెక్క..

ఈ జాబితా ప్రకారం.. యావత్ భారత్‌లోని రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా రూ.12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోనే హైయెస్ట్ డొనెషన్స్ పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీకి రూ.6,061 కోట్ల విరాళాలు బాండ్ల ద్వారా అందాయి. ఇక రెండో స్థానంలో ఉన్న టీఎంసీకి రూ.1,610 కోట్లు, మూడో ప్లేస్‌లో ఉన్న కాంగ్రెస్‌కు రూ.1,422 కోట్లు, నాలుగో ప్లేసులో ఉన్న బీఆర్ఎస్‌కు రూ.1,300 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బిజూ జనతాదళ్‌కు రూ.776 కోట్లు, డీఎంకే పార్టీకి రూ.639 కోట్లు, వైసీపీకి రూ.337 కోట్లు, టీడీపీకి రూ.219 కోట్లు, జనసేనకు రూ.21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.158 కోట్లు, ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆమ్ ఆద్మీకి రూ.65 కోట్లు విరాళంగా అందాయి.

Spread the love