Trending Now

ర్యాష్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ జానకి షర్మిల

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూలై 04 : ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడం ఒకటైతే మరొకటి ర్యాష్ డ్రైవింగ్ ఉంటుందని అన్నారు. అదేవిధంగా మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇన్సూరెన్స్ లేని వాహనాల వాళ్ళ జరిగే ప్రమాదాలలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఎటువంటి ఆర్దిక సహాయం అందదని పేర్కొన్నారు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన జిల్లా పోలీసులు ఎస్పీ ఆదేశాలతో ప్రతిరోజు పట్టణంలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు.

ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 49 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా 7169 ర్యాష్/స్పీడ్ డ్రైవింగ్ కేసులు, 2385 డ్రంకెన్ డ్రైవ్ కేసులు, 456 ర్యాంగ్ సైడ్ డ్రైవింగ్, 490 నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు,2164 త్రిబుల్ రైడింగ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు వివరించారు. గతంలో మైనర్ డ్రైవింగ్ చేస్తు పోలీసు వారికి పట్టుబడితే జరిమానా వేసి, తల్లిదండ్రులు కి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందని తెలిపారు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను న్యాయస్థానంలో హజరు పరచడం జరుగుతుందని పేర్కొన్నారు. తద్వారా న్యాయస్థానం శిక్ష జరిమానా విధించే అవకాశం వుంటుందని అన్నారు. తల్లిదండ్రులు మైనర్ లకు వాహనాలు ఇవ్వద్దని కోరారు.

మైనర్ డ్రైవింగ్, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు గురించి అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తూ.. ముందుకెళ్తున్నామన్నారు.తద్వార విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొందరు యువకులు ద్విచక్ర వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పుచేసి అధిక శబ్దం వచ్చే వాటిని అమర్చుతూ.. పాదచారులను భయభ్రంతులు కలిగేలా రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ తో అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి వాటిపై కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.హారన్లను సైతం అదే తరహాలో అమర్చుతున్నారని, అటువంటి వారి ఆట కట్టించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలకు తీసుకుంటున్నామని, ఇకపై ధ్వని కాలుష్యాన్ని కల్గించే వాహనాన్ని సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముందుగా సంబంధిత వాహనానికి ఉన్న మోడిఫైడ్ సైలన్సర్ను తొలగించి, జరిమానా వేసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తొలగించిన సైలెన్సర్ల స్థానంలో ఆ సంస్థ ఇచ్చిన పొగగొట్టాలని అమర్చాలని సూచిస్తున్నామని పెర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని అన్నారు. అదేవిధంగా లైసెన్సు, నంబర్‌ ప్లేట్‌ నంబర్‌ సక్రమంగా లేని, నంబర్‌ ట్యాంపారింగ్ కలిగిన, నంబర్‌ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామని పట్టుబడిన వాహనాలపై అయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో జనవరి 2024 నుంచి ఇప్పటివరకు కేసుల వివరాలు :

కాంటాక్ట్ కేసులు: 17628(Rs.41,33,700/- రూపాయల ఫైన్)

 • నాన్ కాంటాక్ట్ /కెమెరా కేసులు: 74180(Rs.17727100/- Fine)
 • లేజర్ గన్ కేసులు: 7119 (Rs.7344565 Fine)
 • అతివేగముగా వాహనంలో నడిపినందుకు 7169 కేసులు పెట్టి RS.7169000/- Fine విధించనున్నది.
 • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : 2385/-
 • మైనర్ డ్రైవింగ్ కేసులు : 49(Rs.24500/- Fine)
 • సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపినందుకు 1489 కేసులు పెట్టి ఫైన్ గా Rs.1489000/- విధించనైనది.
 • సిగ్నల్ జంపింగ్ 27 కేసులు పెట్టి, Rs. 27000/- ఫైన్ విధించనైనది.
 • హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు గాను 77076 కేసులు పెట్టి Rs. 11303100/- ఫైన్ విధించనైనది.
 • రాంగ్ సైడ్ డ్రైవింగ్ వాహనం నడిపి నందుకు నడిపినందుకు కేసులు 456 పెట్టి Rs. 103200/- ఫైన్ విధించనైనది.
 • త్రిబుల్ రైడింగ్ 2164 కేసులు పెట్టి రూపాయలు 2596800/- ఫైన్ విధించనైనది.
 • విపరీతమైన శబ్దాలు చేస్తూ తిరిగే 80 బుల్లెట్ వాహనాల యొక్క సైలెన్సర్స్ తొలగించడం జరిగింది.
 • అలాగే వాహనంపై నెంబర్ ప్లేట్ సరిగలేని 490 వాహనాలపై రూ. 98000/- ఫైన్ వేయటం జరిగింది.
 • అలాగే ఇకనుండి మైనర్ పిల్లలు (18 yrs below బాలుడు లేదా బాలిక) వాహనం నడుపుతూ పట్టు పడితే లేక నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా వాహనం నడిపితే కోర్ట్ కి పంపటం జరుగుతుంది కావున వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనములు నడిపించుకోవాలని సూచించారు.
Spread the love

Related News