Trending Now

కాంగ్రెస్​లో చేరడంపై స్పష్టత ఇచ్చిన ’అల్లోల’

కార్యకర్తల సమావేశంలో చర్చించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

నిర్మల్ .( ప్రతిపక్షం ప్రతినిధి) ఏప్రిల్ ,16 : రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం రెండు నెలలుగా డైలమాలో ఉండగా ఇక స్పష్టతకు వచ్చినట్లైంది. నిర్మల్ లోని ఏఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఓ సముదాయంలో నిర్వహించిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభిమానులు,కార్యకర్తల అత్యవసర రహస్య సమావేశంలో పలు విషయాలు వ్యక్తమయ్యాయి. అల్లోల కాంగ్రెస్ లో చేరికను నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పలుమార్లు ఆందోళన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ లో అల్లోలను చేర్చుకునేందుకు అధిష్టానం కాస్త సమయం తీసుకున్నట్లైంది. ఇక నాలుగైదు రోజులలో కాంగ్రెస్ లోనే చేరేందుకు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు మెజారిటీ అభిమానులు కార్యకర్తలు తమ తమ అభిప్రాయాల ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం.అల్లోలను కాదని ముందస్తుగా కాంగ్రెస్ లో చేరిన పలువురు బీ ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఇతరులపై పలువురు అల్లోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అల్లోల రాజకీయ, సామాజిక పరమైన వ్యవహారిక తీరు తెన్నలలో మార్పులు తీసుకురావాలని అయితేనే మా భవిష్యత్తు..మీ భవిష్యత్తు బాగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. 400కు పైగా మంది పాల్గొన్న ఈ అంతర్గత రహస్య సమావేశంలో ఒక్కొక్కరిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయాలను సేకరించారు. కొందరు బిజెపిలో చేరితే బాగుంటుందని.. మరికొందరు మనం బీఆర్ఎస్ లోనే ఉంటేనే సరిగా ఉంటుందని అభిప్రాయపడగా.. మెజార్టీ అభిమానులు మాత్రం అధికార కాంగ్రెస్ లో చేరితేనే బాగుంటుందని సుముఖతను చూపారు.ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తాను లౌకికవాదినని మతతత్వ పార్టీ అయిన బిజెపిలోకి పోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ దేశాన్ని ఏలే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంతేకాకుండా కాంగ్రెస్ లో చేరితేనే తన రాజకీయ పూర్వ వైభవం తనకు వస్తుందని తెలిపారు. తనకు కాంగ్రెస్ లో ఉన్న సంబంధాలు, బంధత్వాల కారణంగా నిర్మల్ నియోజకవర్గం ను తగిన విధంగా న్యాయం చేయగలుగుతానని తెలిపారు. ఎందరు ఎన్ని రకాలుగా తనను వ్యతిరేకించిన తనతో కష్ట కాలంలో తోడు నీడగా నిలిచిన వారందరికీ తాను అండగా ఉంటానని అల్లోల భరోసా కల్పించారు. తనను కాదని ముందుగా వెళ్లిన ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు అగ్రహాలు వద్దని సామరస్యతతో ఉండి ముందుకెళ్దామని అల్లోల ఈ సందర్భంగా హితబోధ చేశారు.

Spread the love

Related News