Trending Now

చింతమడకలో ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామమైన చింతమడకలో ఆయన ఓటు వేశారు. చేతి కర్ర సహాయంతో పోలింగ్ బూత్ కు వచ్చిన కేసీఆర్ వెంట హరీష్ రావు, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

కేసీఆర్‌ను చూసేందుకు పోలింగ్ బూత్ వద్ద ప్రజలు ఆసక్తి చూపారు. కొంత మంది సెల్ ఫోన్లతో కేసీఆర్‌ను ఫొటో తీసుకున్నారు.

ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంత్రి రోజా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి సీతక్క, మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు, మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, నాగచైతన్య, దర్శకుడు రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు తదితరులు ఓటు వేశారు.

Spread the love

Related News