ప్రతిపక్షం, ఆగస్టు 15: హైదరాబాద్‌లో యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన హోదాను అడ్డుపెట్టుకుని ఓ మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని మెహిదీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకిలోని రాహుల్ కాలనీకి చెందిన ఆరీఫ్ హుస్సేన్ ఓ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. తనకు ఉన్న పరిచయాలు, రిపోర్టర్ హోదాను అడ్డుపెట్టుకుని 31 ఏళ్ల మహిళను భయాందోళనలకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో మెహిదీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడు ఆరీఫ్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి వ్యవహారశైలిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా కేసును వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.





























