Trending Now

బీజేపీకి సహకరించడాన్ని ఖండించిన జేఏసీ నేతలు..

ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 5: హుస్నాబాద్ నియోజకవర్గం, రాష్ట్ర, దేశ ప్రజలకు హుస్నాబాద్ జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం రోజున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతు తెలిపినందుకు అందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, జన సమితి జేఏసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గం జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతిలో బీజేపీకి సహకరించటం అత్యంత హేయమైన చర్యగా పరిగణిస్తూ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలతో సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ తొత్తుగా మారడం యావత్ తెలంగాణ ప్రాంతం గమనించిందన్నారు. రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాల వారు బీజేపీ కుట్రలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, ప్రొఫెసర్ వీరన్న నాయక్, రాజగోపాల్ రావు, కేడం లింగమూర్తి, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ బంక చందు మార్క అనిల్ గౌడ్, నాంపల్లి సమ్మయ్య, మడప జయపాల్ రెడ్డి, దండి లక్ష్మి, ముత్యాల సంజీవరెడ్డి, పొన్నాల ఫ్రాన్సిస్, ఐలేని సంజీవరెడ్డి, ఐలేని మల్లారెడ్డి, ఉల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News