ప్రతిపక్షం, జూలై 16: హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో ఓ మహిళను నమ్మించి మోసం చేసిన యువకుడిపై ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్‌కు చెందిన 28 ఏళ్ల మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిల్మ్‌నగర్‌లో నివసించే రంజన్ కుమార్‌కు ఈ విషయం తెలిసినా.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన యువకుడు.. ఆమె రెండుసార్లు గర్భం దాల్చిన సమయంలో గర్భస్రావం కోసం మాత్రలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
కొంతకాలం తర్వాత రంజన్ కుమార్ తనను దూరం పెట్టడం ప్రారంభించాడని బాధితురాలు తెలిపింది. చివరకు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఫిల్మ్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. ఆరోపణలపై విచారణ కొనసాగిస్తున్నారు.


















