ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులు చెల్లించే ఇన్‌కమ్ ట్యాక్స్‌ను రీయింబర్స్ చేస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. భూపాలపల్లిలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో ఆయన మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణిని తమ జేబు సంస్థగా మార్చి నష్టపరిచాయని విమర్శించారు.
సింగరేణి సంస్థను బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ సాధించే అవకాశం ఉందని, దీంతో సంస్థ మరింత బలపడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


















