రేవంత్ రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు.. మిడ్జిల్‌లో నేడు భారీ బహిరంగ సభ

ప్రతిపక్షం, జూలై 04: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2006 జులై 4న మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రాజకీయాల్లో తొలి అడుగు వేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు మిడ్జిల్‌లో పర్యటించనున్నారు. సుమారు రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అంతకుముందు నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Spread the love

Related News

Latest News